Najareyuda Naa Yesayya
నజరేయుడా నా యేసయ్య
నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము
నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||
1. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
2. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
3. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||