ALPHA TELUGU LYRICS

TELUGU CHRISTIAN SONGS

Krupa Kshemamu Nee Needalo

కృపా క్షేమము నీ నీడలో


కృపా క్షేమము నీ నీడలో – నిరంతరము నాకు తోడుగా (2) నీవే నా కాపరివి – నాకు లేమియే లేదు (2) ||కృపా|| 1. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయువాడవు (2) శాంతికరమైన జలముల చెంత – నన్ను నడిపించువాడవు (2) ||కృపా|| 2. గాఢాంధకార లోయలో – నేను సంచరించినను (2) ఏ కీడుకు నేను భయపడను – నీవు నాకు తోడైయుందువు (2) ||కృపా|| 3. శత్రువుల ఎదుట నాకు – భోజనము సిద్ధపరచెదవు (2) నూనెతో నా తల అంటితివి – నా పాత్ర నిండి పొర్లుచున్నది (2) ||కృపా||

Yehova Naa Moralinche

యెహోవా నా మొరాలించె


యెహోవా నా మొరాలించెను – తన కృపను నాపై చూపించెను (2) యేసయ్య యేసయ్య – నన్నెంతగా ప్రేమించావయ్య (2) 1. అపాయములలో నేనున్నప్పుడు – నా అండగా నీవు నిలిచావయ్యా (2) భయములతో నేను కృంగినప్పుడు – ధైర్యమునిచ్చి నడిపావయ్యా (2) ||యేసయ్య|| 2. శత్రువులెందరో నను చుట్టుముట్టినా – నీ రెక్కల చాటున దాచావయ్యా (2) నా విజయ గీతము నీవేనయ్యా – నా స్తుతి పాత్రవు నీవేనయ్యా (2) ||యేసయ్య||

Mahonnathuda Nee Needalo

మహోన్నతుడా నీ నీడలో


మహోన్నతుడా నీ నీడలో – మనసారా నివసించెదన్ సర్వశక్తుడా నీ రెక్కల చాటున – సంతోషముగా విశ్రమించెదన్ (2) 1. నీవే నా ఆశ్రయము – నీవే నా కోటవు నే నమ్ముకొను నా దేవుడవు – నీవే నా దుర్గము (2) ||మహోన్నతుడా|| 2. వేటగాని ఉరి నుండి – విడిపించువాడవు నీవే పాడుచేయు తెగులు రాకుండా – నన్ను కాపాడువాడవు (2) ||మహోన్నతుడా|| 3. నీ రెక్కలతో నన్ను కప్పెదవు – నీ భక్తులకు కేడెము నీవే రాత్రివేళ కలుగు భయమునకైనా – పగలు ఎగిరే బాణమునకైనా (2) ||మహోన్నతుడా||

Siluva Chentha

సిలువ చెంత చేరుమా


సిలువ చెంత చేరుమా – పాపి సిలువ చెంత చేరుమా (2) కలువరి గిరిపైన మనకై – ప్రాణము నిచ్చెను యేసయ్య (2) 1. ఘోరమైన పాపములను – తుడిచి వేయును యేసయ్య (2) కన్నీరంతా తుడిచి వేసి – కమ్మని శాంతిని ఇచ్చును (2) ||సిలువ|| 2. లోక ఆశలు నిన్ను విడచినా – యేసు నిన్ను విడువడు (2) ఆపదలో ఆదుకొని – ఆదరణను ఇచ్చును (2) ||సిలువ||

Aashrayudu Neeve

ఆశ్రయుడు నీవే నా యేసయ్యా


ఆశ్రయుడు నీవే నా యేసయ్యా – ఆధారం నీవే నా మెస్సయ్యా (2) నీవే నీవే – నా ప్రాణం నీవే (2) ||ఆశ్రయుడు|| 1. శ్రమల కొలిమిలో నేనున్నప్పుడు – నన్ను విడవని నా దేవుడవు (2) అగ్నిలో నుండి నన్ను తప్పించి – నీ తోడుగా నన్ను నిలిపావు (2) ||నీవే నీవే|| 2. లోకమంత నన్ను విడనాడినా – నీవు నన్ను విడువలేదు (2) తల్లి వలె నన్ను ఓదార్చి – తండ్రి వలె నన్ను నడిపావు (2) ||నీవే నీవే||

Hosanna Hosanna

హోసన్న హోసన్న

Artist: Starry Daniel


హోసన్న హోసన్న – హోసన్న హోసన్న (2) యేసు నామానికే హోసన్న – మెస్సయ్య నామానికే హోసన్న (2) 1. అంధకారమున ఉన్న నాకు వెలుగుగా వచ్చితివే (2) పాప కూపములో ఉన్న నన్ను ప్రేమతో లేపితివే (2) ||హోసన్న|| 2. వ్యాధి బాధలలో ఉన్న నాకు విడుదలను ఇచ్చితివే (2) కన్నీటి లోయలో ఉన్న నన్ను కౌగిలి చేర్చితివే (2) ||హోసన్న|| 3. ఎడారిలో ఉన్న నా యాత్రలో నా తోడుగా వచ్చితివే (2) నా దాహము తీర్చుటకు బండ నుండి నీళ్ళు ఇచ్చితివే (2) ||హోసన్న||

Ebinejare Ebinejare

ఎబినేజరే ఎబినేజరే

Artist: John Jebaraj (Telugu Version)


నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2) స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం 1. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే (2) ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే|| 2. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే (2) నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||