ALPHA TELUGU LYRICS

TELUGU CHRISTIAN SONGS

Mahonnathuda Nee Needalo

మహోన్నతుడా నీ నీడలో


మహోన్నతుడా నీ నీడలో – మనసారా నివసించెదన్ సర్వశక్తుడా నీ రెక్కల చాటున – సంతోషముగా విశ్రమించెదన్ (2) 1. నీవే నా ఆశ్రయము – నీవే నా కోటవు నే నమ్ముకొను నా దేవుడవు – నీవే నా దుర్గము (2) ||మహోన్నతుడా|| 2. వేటగాని ఉరి నుండి – విడిపించువాడవు నీవే పాడుచేయు తెగులు రాకుండా – నన్ను కాపాడువాడవు (2) ||మహోన్నతుడా|| 3. నీ రెక్కలతో నన్ను కప్పెదవు – నీ భక్తులకు కేడెము నీవే రాత్రివేళ కలుగు భయమునకైనా – పగలు ఎగిరే బాణమునకైనా (2) ||మహోన్నతుడా||