Hosanna Hosanna
హోసన్న హోసన్న
Artist: Starry Daniel
హోసన్న హోసన్న – హోసన్న హోసన్న (2)
యేసు నామానికే హోసన్న – మెస్సయ్య నామానికే హోసన్న (2)
1. అంధకారమున ఉన్న నాకు వెలుగుగా వచ్చితివే (2)
పాప కూపములో ఉన్న నన్ను ప్రేమతో లేపితివే (2) ||హోసన్న||
2. వ్యాధి బాధలలో ఉన్న నాకు విడుదలను ఇచ్చితివే (2)
కన్నీటి లోయలో ఉన్న నన్ను కౌగిలి చేర్చితివే (2) ||హోసన్న||
3. ఎడారిలో ఉన్న నా యాత్రలో నా తోడుగా వచ్చితివే (2)
నా దాహము తీర్చుటకు బండ నుండి నీళ్ళు ఇచ్చితివే (2) ||హోసన్న||