Enduko Nanninthaga Neevu
ఎందుకో నన్నింతగా నీవు
Artist/Lyricist: Rev. Thumati Moses
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
1. నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే (2) ||ఎందుకో||
2. నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో||
3. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు (2) ||ఎందుకో||